తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ భద్రతా ఏర్పాట్లను పరిశీలిచారు. బ్రాహ్మణ వెల్లంల, ఎన్జీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మెడికల్ కళాశాల వద్ద సభా ప్రాంగణం పరిశీలించారు.