తమిళనాడులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

81చూసినవారు
తమిళనాడులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
తమిళనాడు రాజధాని చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి ముగ్గురు మరణించారు. మరో 23 మంది అస్వస్థతకు గురైనట్టు అధికారులు తెలిపారు. స్థానిక పల్లవరంలో గురువారం పలువురు కలుషిత నీరు తాగడంతో వాంతులు, వీరేచనాల వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారందరినీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్