బుగ్గపాడును పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతా: మంత్రి శ్రీధర్ బాబు

63చూసినవారు
బుగ్గపాడును పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతా: మంత్రి శ్రీధర్ బాబు
సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్ పార్క్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కీలక హామీలు ఇచ్చారు. బుగ్గపాడును పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ రంగం, ఉపాధి కల్పన జరగాలని, స్థానిక నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు కల్పించాలని ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్