చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానికి తప్పిన ప్రమాదం

57చూసినవారు
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానికి తప్పిన ప్రమాదం
ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడలో తమ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన శనివారం బయలుదేరి వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారును ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ నానితో పాటు కారులో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్