పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైస్కూల్ పరిధిలోని ఇంటర్మీడియట్ విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ మార్చుతున్నామని, NCERT, పోటీ పరీక్షల సిలబస్‌తో సర్దుబాటు చేస్తూ ద్వితీయ సంవత్సరం సిలబస్‌నూ తగ్గించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.