AP: హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని జగదీష్‌పై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత అతడిని తొలగించారు. దీంతో కేడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు.