AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 9, 10వ తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షకు 80 మార్కులకు కుదిస్తారు. మిగతా 20 అంతర్గత మార్కులుగా ఉంటాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది.