సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. 15 పరుగుల వద్ద లుబుషేన్‌ను బుమ్రా ఔట్ చేశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు తీశాడు. మొదట కొనస్టాస్(23)ను, తర్వాత ట్రావిస్ హెడ్(4)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆస్టేలియా 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో బ్యూ వెబ్‌స్టర్ 11, స్మిత్ 18 ఉన్నారు.