చిత్తూరు: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: సీఐ

59చూసినవారు
చిత్తూరు సమీపంలోని గంగాసాగరం వద్ద రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తాలూకా సీఐ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. రాంగ్ రూట్ లో టిప్పర్ వచ్చి బస్సును ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఆరుగురిని చీలపల్లి సీఎంసీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్