కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు చేతులుమీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రసాద్ అందుకున్నారు. అవార్డు అందుకున్న ప్రసాద్ ను పోలీస్ సిబ్బంది అభినందించారు.