కుప్పం డీఎస్పీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శుక్రవారం స్థల పరిశీలన చేశారు. కొత్తపేటలో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద డీఎస్పీ కార్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉందని వారు స్పష్టం చేశారు. కడా పీడీ వికాస్ మర్మత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.