విపత్తును ఎదురుకోవడానికి తమ ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉన్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో నీటి ప్రవాహాన్ని బుధవారం ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వరద ప్రవాహం మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలిసి చర్చించారు. ఆయన వెంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.