మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో మాజీ ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్ ను కుప్పం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులో సెంథిల్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెస్కోలో నిధుల గోల్ మాల్ వ్యవహారం పై ప్రస్తుత ఎండీ సోమశేఖర్ ఫిర్యాదు పై సెంథిల్ పై కేసు నమోదు అయింది.