తమ రిలేషన్ షిప్ లో భాగస్వామిని పొగుడ్తూ, మానసికంగా లొంగదీసుకోవడాన్ని లవ్ బాంబింగ్ అంటారు. గత కొంతకాలంగా జెనరేషన్ జెడ్ అంటే 12-27 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ ట్రెండ్ పెరుగుతోంది. లవ్ బాంబింగ్ చేసే వ్యక్తి భాగస్వామిని భావోద్వేగపరంగా ఆకర్షించడానికి అతి ప్రేమ, ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వీరు భాగస్వామి నమ్మకాన్ని పొంది, వారి నుంచి రహస్యాలు తెలుసుకున్నాక భవిష్యత్తులో వేధింపులకు గురి చేసే అవకాశం ఉంది.