పలమనేరు సినిమా థియేటర్ల ఓనర్లు సిండికేట్ గా మారి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని స్థానికులు కొందరు శుక్రవారం ఆరోపించారు. ధరలు తగ్గించాలంటూ ఎమ్మార్వో ఇన్బనాథన్కు వినతిపత్రం ఇచ్చారు. థియేటర్ల ఓనర్లంతా కలిసి అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారు. హాల్లో కనీస సౌకర్యాలు లేవు. బాత్రూములు వెళ్లాలన్నా కంపు కొడుతున్నాయి. థియేటర్ల పై చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలిఅని కోరారు.