బంగారుపాళ్యం మండల పరిధిలోని బోయకొండ శ్రీ వజ్రాలపురం గంగమ్మ ఆలయ ఆవరణలో చిత్తూరు జిల్లా ఈడిగా గౌడ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ మద్దిలేటి కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.