చిత్తూరు జిల్లా తవణంపల్లిలో విద్యార్థులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాల పై హెడ్ కానిస్టేబుల్ గజేంద్ర శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్ ద్వారా వచ్చే సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే డయల్-100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.