కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి వైభవంగా నిర్వహించారు. ముందుగా అలంకార మండపంలో వినాయక స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శుక్రవారం రాత్రి లంబోదరుడిని స్వర్ణరథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ఏఈఓ రవీంద్రబాబు పాల్గొన్నారు