పుంగనూరు అర్బన్ కొత్తపేటలోని ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో ఆదివారం సపోజ్ క్రిస్మస్ ఆరాధనలు ఘనంగా జరిగాయి. మొదట ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు, భజనలు, గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జీవన్ బాబు ఏసుప్రభు గొప్పతనం, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.