అంతక్రియలకై అగచాట్లు.. నడుములోతు నీటిలో
తిరుపతి జిల్లాలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో, 53 ఏళ్ల శంకర్ అంత్యక్రియలకు అరుణా నది కాలువను దాటి వెళ్లాల్సి వచ్చింది. తుపాను ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీటిలో ప్రవాహం పెరగడంతో గ్రామస్తులు శవాన్ని భుజాలపై మోసుకుంటూ నడుము లోతు నీటిని దాటడం కష్టంగా మారింది. దాదాపు 4 అడుగులకు పైగా నీటిలో ఈదుతూ శవాన్ని తరలించి, అంత్యక్రియలు పూర్తి చేశారు.