అమెరికా’ ప్రమాద మృతులకు కన్నీటి వీడ్కోలు

54చూసినవారు
అమెరికా’ ప్రమాద మృతులకు కన్నీటి వీడ్కోలు
ఆ రెండు కుటుంబాలు తమ పిల్లల మృతదేహాల కోసం పది రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. ఎదురుచూశాయి. శుక్రవారం సాయితేజారెడ్డి, హరితారెడ్డి దంపతుల మృతదేహాలు రాగానే వీరి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. కేవీబీపురం మండలం ఆదరంలో బంధుమిత్రులు, స్థానికుల కన్నీటి వీడ్కోలు నడుమ ఆ దంపతులకు అంత్యక్రియలు జరిగాయి. ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరితారెడ్డి, మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. సాయితేజారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15న అసువులు బాసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్