మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తాం

78చూసినవారు
మార్చి లోపు తుడా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేస్తాం
తుడా టవర్స్ నిర్మాణాలు 2026 మార్చి లోపు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య తెలిపారు. నగరంలోని రాయలచెరువు రోడ్డులో తుడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య శనివారం ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్