టీటీడీ రవాణా శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ శనివారం స్థానిక వర్క్‌షాపులో ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టీటీడీ వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.