తిరుపతి: మద్యం షాపుల టెండర్ల ఓపెన్ లాటరీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి
తిరుపతి జిల్లాలో ప్రభుత్వ నూతన మద్యం పాలసీ మద్యం షాపుల టెండర్లకు సంబంధించిన ఓపెన్ లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. సోమవారం తిరుచానూరు శిల్పారామం ఫంక్షన్ హాల్ నందు మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను కలెక్టర్, జేసీ శుభం బన్సల్, సంబంధిత ఎక్సైజ్ అధికారులతో కలిసి ప్రారంభించారు.