రెండు రోజుల పర్యటన పనిమిత్తం స్వగ్రామం నారావారిపల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమాలు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు అక్కడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి సచివాలయానికి చేరుకోనున్నారు.