మంచు మనోజ్ కుటుంబ తగాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బుధవారం మంచు మనోజ్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్దకు వెళ్లగా గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మనోజ్ నిన్న జరిగిన గొడవపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లపై కేసులు నమోదు అవగా తాజా ఫిర్యాదుతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.