ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి

66చూసినవారు
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
చంద్రగిరి మండలం ముక్కోటి సమీపంలోని సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారి కలిసే ప్రదేశంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ప్రసాద్ శనివారం పరిశీలించి అధికారులకు సూచించారు. జాతీయ రహదారి అధికారులతో కలిసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు ఈ ప్రదేశంలో ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్