తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం రాత్రి హంస వాహన సేవలో 12 కళా బృందాలకు చెందిన 256 మంది కళాకారులు తమ నాట్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు హంస లక్ష్మీలు, నెమలి నృత్యం, కైల్‌కుట్టి కాళి, జానపదనృత్యం, కోలాటాలు, నృత్యాలు భక్తులకు కనువిందు చేశారు.