వైఎస్ఆర్ గ్రామీణ మెగా క్రికెట్ టోర్నమెంట్

2575చూసినవారు
వైఎస్ఆర్ గ్రామీణ మెగా క్రికెట్ టోర్నమెంట్
చంద్రగిరి నియోజకవర్గంలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు యువతలో స్నేహ భావాన్ని పెంచడానికి మే 14వ తేదీ నుంచి వైఎస్ఆర్ గ్రామీణ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. తుమ్మలగుంటలోని ఆయన నివాసం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల సహకారంతో గ్రామీణ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. పంచాయతీల నుంచి ఎంత మంది క్రీడాకారులు అయినా పోటీలో పాల్గొనవచ్చునని, 17 సంవత్సరాల వయస్సు దాటిన వారికి మాత్రమే అవకాశం వుంటుందన్నారు. ఏ పంచాయతీకి చెందిన వారు ఆ పంచాయతీ తరపున మాత్రమే ఆడాలన్నారు. అలాగే ఒక టీమ్ లో ఆడిన వారు మరొక టీమ్ లో అడటానికి వీలు లేదని, పోటీల్లో పాల్గొనదలచిన వారు వారి వయస్సు, చిరునామా ద్రువీకరణకు సంబంధించిన పత్రాలు (ఆధార్, విద్యార్హత సర్టిఫికేట్లు) తప్పని సరిగా దరఖాస్తు ఫారానికి జత చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్