ఆటో సహా రెండు 2,50 లక్షల కర్ణాటక మద్యం సీజ్

2535చూసినవారు
ఆటో సహా రెండు 2,50 లక్షల కర్ణాటక మద్యం సీజ్
ఆటో సహ రూ. 2, 50లక్షల విలువైన ర్ణాటక మద్యం సీజ్ చేసి ఇద్దరు కర్ణాటక యువకులను మదనపల్లి చెక్ పోస్టు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి మదనపల్లి ఎస్ఈబి చెక్ పోస్టు SI వై. బాబు శనివారం తెలిపిన వివరాలు. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు గెలిజిగూరుకు చెందిన జిఎస్. రాము25, జివి కృష్ణకుమార్ 25లు కలసి మూడు మూటల్లో రూ. 50 వేల విలువైన 225 కర్ణాటక టెట్రాప్యాకెట్లు ఆటోలో అర్ధరాత్రి వేల మదనపల్లికి తరలిస్తుండగా చీకిల బైలు చెక్ పోస్టు తనిఖీలో పట్టుబడినట్లు తెలిపారు. ఆటో సహా 2. 50లక్షల మద్యం సీజ్ చేసి నిందితులను విచారణ నిమిత్తం స్థానిక సెబ్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారిద్దరిపై అక్రమ మద్యం తరలింపు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిధితులను పట్టుకోవడంలో ఎస్ఐ వై బాబు హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు యశోదలు ప్రతిపకనపరచడంతో సిఐ వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్