జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక పిసిఆర్ సర్కిల్లో శనివారం సాయంత్రం సంబరాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు కటారి హేమలతకు చూడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. సంబరాల్లో ట్రాఫిక్ కాస్త ఇబ్బందిగా మారడంతో స్థానిక వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.