స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి

81చూసినవారు
స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి
స్వచ్ఛతాహీ సేవ -2024 కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని చిత్తూరు నగరపాలక ఆరోగ్య అధికారి డా.అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు.. శుక్రవారం నగరంలో జైహింద్ పాఠశాలలో విద్యార్థులు, మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి ర్యాలీ, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎంహెచ్వో మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత కోసం విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్