మదనపల్లి బసినికొండలో నాటు సారా విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను గురువారం సాయంత్రం మదనపల్లి ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై హరిహర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నెమలి నగర్ వడ్డిపల్లి కి చెందిన మంగమ్మ(40), వెంకటమ్మ(65)లు వేరువేరుగా నాటు సారా స్థానికులకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబట్టడం జరిగిందన్నారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని నిందతులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.