గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పాపిరెడ్డి పల్లి, పాతపాలెం, జీఎంఆర్ పురం, దిగువ కమ్మ కండ్రిగ, ఎగువ కమ్మకండ్రిగ వద్ద వాగులలో గురువారం వరద ప్రవాహం పెరగడంతో మండలంలోని దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రజలు వాగులు వంకలు దాటడానికి ప్రయత్నించకూడదని అధికారులు సూచించారు.