మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

53చూసినవారు
మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి
గూడూరు పట్టణంలోని మోడల్ పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూం, ఎన్నికల మెటీరియల్ ను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని జెడ్పీ బాలుర, బాలికల పాఠశాలలో, మున్సిపల్ సచివాలయంలో మోడల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట గూడూరు డివిజన్ ఎన్నికల అధికారి ఎం. కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్