దారుణం.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన భర్త

80చూసినవారు
దారుణం.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన భర్త
TG: నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో భర్త కిరణ్ తన భార్య అరుణను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్