కుప్పం నియోజకవర్గంలో ఎదేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానిక ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎక్సైజ్ సీఐ నాగరాజును వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తప్పకుండా చేపడతామని ఆయన స్పష్టం చేశారు.