వైభవంగా పెద్దపల్లి గంగమ్మ కల్యాణోత్సవం

1569చూసినవారు
కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ కళ్యాణ మహోత్సవాన్ని శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త శివకుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్