నగరిలో బెల్టుషాపులపై దాడి

51చూసినవారు
నగరిలో బెల్టుషాపులపై దాడి
నగరి మండలంలోని బుగ్గ అగ్రహారంలో బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారంతో సోమవారం చిత్తూరు డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస ఆచారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. సత్యనారాయణ, సిబ్బంది దాడులు నిర్వహించారు. 53 డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలను ఉంచుకున్న వి. లక్ష్మి (58) అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం ఆమెను నగరి పోలీసులకు అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్