ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

68చూసినవారు
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
పుత్తూరు మండలంలోని రాచపాలెంలో పొదుపు సంఘాల సౌకర్యార్థం రాస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆసుపత్రి అధికారి వెంకటముని తెలిపారు. రాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం నాగరాజుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 170 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అందులో 36 మందికి శస్త్ర చికిత్స చేయాల్సిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్