నగరి: ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

76చూసినవారు
చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగృహం నందు సోమవారం వేకువ జామున భోగి మంటలు వేసి పండగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగిమంటల వెలుగులో ప్రజలందరూ నవ్వుతూ సంతోషంగా జీవించాలని ఆమె కోరారు. పలువురు వైసీపీ నాయకులు రోజాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్