నగరి పట్టణంలో వెలసిన శివాలయంలో శనివారం ఉదయం కార్తీక మాసం, అష్టమి సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో వేదపండితులు గణపతి పూజ, కలశ పూజ జరిపారు. అనంతరం లోక సంక్షేమం కొరకు ఆర్జితంగా మహాకాళ భైరవ రక్షణ యాగం, పూర్ణాహుతి జరిపారు. కాలభైరవ స్వామి వారికి పంచామృతములతో అభిషేకము చేశారు. అర్చకులు నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.