నగరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అటనమస్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.