ఓ విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు మేరకు నగరిలోని ఇందిరా నగర్ కు చెందిన చాంద్బాషా కుమారుడు మజీద్ (15) నూతన సంవత్సరం సందర్భంగా తన మిత్రులతో కలిసి రాంనగర్ సమీపంలో ఉన్న కుశస్థలి నదీ పరివాహక ప్రాంతంలో సరదాగా గడపడానికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు మజీద్ కాలుజారి కుశస్థలి నదిలో పడిపోయాడు. ఘటనాస్థలకి రేస్క్యూ టీం చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.