చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గ, నిండ్ర మండలం, ఆరూరు వడ్డి ఇండ్లకు రూ .12. 80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును శుక్రవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.