తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నాంటూ అంటూ మాజీ మంత్రి రోజా 'ఎక్స్ 'వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను శుక్రవారం ప్రశ్నించారు. 'చంద్రబాబు అధికారులపై చర్యలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యమా, ఇదేనా మీ సనాతన ధర్మం అంటూ ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం వేర్వేరుగా వచ్చారంటేనే వారి వ్యూహం ఏమిటో తెలుస్తుంది' అంటూ రోజా ట్వీట్ చేశారు.