పుత్తూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 26న జరిగే ధర్నాలో కార్మికులు, రైతులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.