పుత్తూరులో ఈ నెల 28న జాబ్ మేళా

82చూసినవారు
పుత్తూరులో ఈ నెల 28న జాబ్ మేళా
నగిరి నియోజకవర్గం, పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 28వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ 9 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్