నగరి మున్సిపాలిటీ కీలపట్టు దళిత వాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రాజేంద్ర ఆకస్మితికిగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం రాజేంద్ర భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేంద్ర మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.