నిండ్ర గ్రామంలో ఉన్న ప్రసన్న వినాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం బాలాలయం పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ క్రమంలో వేదపండితులు ఉదయం నుంచి విశేష హోమం,పూజలు చేశారు.అనంతరం అత్తి చెక్కతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి అందులో స్వామి వారిని ఆవహించారు.ఆలయ మరమ్మత్తుల నిమిత్తం బాలాలయం చేశామని ఆలయ ధర్మకర్త రమేష్ నాయుడు తెలిపారు.